Thursday 23 July 2015

విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన 'శ్రీమంతుడు'

మహేశ్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి… అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి… తొలిసారి మహేశ్ సరసన శ్రుతిహాసన్ నాయికగా నటించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది… ప్రాంతాలవారిగా అమ్మకాల్లో ‘శ్రీమంతుడు’ మహేశ్ బాబు చిత్రాల్లోకి నంబర్ వన్ గా నిలచింది… ఆంధ్ర ప్రాంతంలో ఈ చిత్రం హక్కులు 21 కోట్లు పలుకగా, తెలంగాణలో 14 కోట్ల నలభై లక్షలు పలికాయి… ఇక రాయలసీమలో ‘శ్రీమంతుడు’ 7 కోట్ల ఇరవై లక్షలకు అమ్ముడు పోగా, కర్ణాటక నుండి మరో ఆరు కోట్లు సంపాదించాడు… మన దేశంలోని ఇతర ప్రాంతాల నుండి మరో రెండు కోట్లు రానుంది… ఇక ‘శ్రీమంతుడు’ ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లు పలికాయి… వెరసి ప్రాంతాలవారిగా ‘శ్రీమంతుడు’ మొత్తం 59 కోట్ల అరవై లక్షలు పలికింది… కాగా, ఈ సినిమా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ అన్నీ కలిపి మరో 15 కోట్లు పలికినట్టు భోగట్టా… ఈ రీతిన విడుదలకు ముందే ‘శ్రీమంతుడు’ టైటిల్ కు తగ్గట్టుగానే 75 కోట్ల బిజినెస్ చేయడం విశేషం!
Read more »

No comments:

Post a Comment