Thursday, 9 July 2015

VarunTej's 'LOAFER' Movie Opening..

ముకుంద’ చిత్రంతో హీరోగా పరిచయమైన మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లోఫర్‌’. ఈ సినిమా షూటింగ్‌ లాంచనంగా ఈరోజు(జూలై 8న) హైదరాబాద్‌లోని పూరిజగన్నాథ్‌ ఆఫీసులో ప్రారంభమైంది. దేవుని పటాలపై ముహుర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి పూరిజగన్నాథ్‌ శ్రీమతి లావణ్య, నాగబాబు శ్రీమతి పద్మజ క్లాప్‌ కొట్టగా, నాగబాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నాగబాబు కుమార్తె నిహారిక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా….
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మదర్‌ సెంటిమెంట్‌, హై యాక్షన్‌ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో క్యారెక్టరైజేషన్‌ మాసీగా వుంటుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రవితేజకి ఇడియట్‌, మహేష్‌కి పోకిరి, ఎన్టీఆర్‌కి టెంపర్‌, చరణ్‌కి చిరుతల, బన్నికి దేశముదురు ఎలా మాస్‌ సినిమాలు అయ్యాయో అలా వరుణ్‌తేజ్‌కి ‘లోఫర్‌’ మంచి మాస్‌ సినిమా అవుతుంది. రేపటి నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. జూలై 21 నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌లో నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేసి విజయదశమి కానుకగా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ని అలరించే పూరి మార్క్‌ చిత్రంగా ‘లోఫర్‌’ రూపొందుతుంది’’ అని అన్నారు. సుప్రీమ్‌ హీరో వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌ బిగెనింగ్‌లోనే పూరి జగన్నాథ్‌గారి వంటి పెద్ద డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. లోఫర్‌ సబ్జెక్ట్‌ వినగానే ఎంతో ఎగ్జైట్‌ అయ్యాను. పూరిగారి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుని నా కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది’’ అన్నారు
వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితయి నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌. సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌
Read more »

No comments:

Post a Comment