Monday 16 February 2015

‘టెంపర్‌’కి పటాస్‌ పోలిక | Temper looks like Pataas

‘టెంపర్‌’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘పటాస్‌’ సినిమాకి దగ్గరగా ఉంటుందని బజ్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. నిజంగానే ఈ చిత్ర కథ ‘పటాస్‌’ని పోలి ఉంటుందని స్పష్టమైన సమాచారం అందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కరప్ట్‌ పోలీస్‌ పాత్ర చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. కరప్షన్‌లో పీక్స్‌ చూపించే పాత్రలో ఎన్టీఆర్‌ రెచ్చిపోయి నటించాడట. తొలిసారిగా తన కెరియర్‌లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేసిన ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపించాడట.
అయితే ఒక యువతిపై జరిగిన దారుణమైన రేప్‌ ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌లో మార్పు తెస్తుందట. దాంతో అతడు మారిపోయి విలన్లపై ‘దండయాత్ర’ మొదలు పెడతాడట. రేప్‌కి గురయ్యే యువతిగా మధురిమ నటించింది. పటాస్‌లో కూడా ఒక మూగ పిల్లని దారుణంగా చంపిన తర్వాతే కళ్యాణ్‌రామ్‌ పాత్రలో పరివర్తన వస్తుందనే సంగతి తెలిసిందే. ఇందులో కూడా హీరోలో ఛేంజ్‌ అలాంటి సంఘటనతోనే రావడంతో చాలా మంది పటాస్‌ని గుర్తు చేసుకుంటారని అంటున్నారు. అయితే పటాస్‌ చిత్రాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా తీస్తే, ఇందులో ఎమోషన్‌కి ప్రాధాన్యత ఇచ్చారట. సెకండ్‌ హాఫ్‌ చాలా వయొలెంట్‌గా, ఎమోషనల్‌గా ఉంటుందని సమాచారం.
Before the release of Temper, there were rumors that Temper story is similar to PataasThis story looks almost similar to Nkr's Pataas where he is also seen as corrupt officer and later turns into a sincere police officer, Temper looks mix of Pataas, But the film team has declined the reports and promoted. Anyway both 'Nandamuri' Heroes enjoying Block Buster Hits on this NEW Year 2015. It is the great begining for their all time industry records.

No comments:

Post a Comment